సికింద్రబాద్ మహంకాళి మందిరము అమ్మవారి మూలవిరాట్టు ను పోలిన ఏకశిల రాతి విగ్రహం
ఇందూరు జిల్లా లోని భోధన్ మండలం లో అమ్ధాపూర్ గ్రామంలో స్థానిక నిజాం షుగర్ ఫ్యాక్టరీ లో కార్మికునిగా పనిచేస్తూ శక్కర్ నగర్ రామాలయం ఎదురుగావున్న రాజారాజేశ్వరి దేవి,మైసమ్మ దేవతలకు ఆరాదకుడిగా పూజలునిర్వహించేవాడు ఉద్యోగానంతరం తాను కొలిచే అమ్మవార్లను నిత్యం పూజలు నిర్వహించాలని సదుద్దేశంతో అమ్దాపూర్ గ్రామం లోని నేటి బస్టాండ్ ప్రాంతంలో ఒక చిన్నపూరి గుడిసెలో తన భార్యతో కలసి జీవనం కొనసాగించేవాడు.అలా భక్తితో దైవారాధన చేస్తూ మనమందరం అమ్మవారిని కొండపైన చిన్నగా భక్తులందరికి కాపాడే జగన్మాతను జగజ్జనని దేవి గా స్థానిక ప్రజలనమ్మకంతో మహంకాళిగా అమ్మవారి పూజలు చేయడం ప్రారంభించారు అలా అమ్మవారు కూడా కలలో దర్శనం ఇవ్వడం లాంటివి జరిగినవి అని ఇరువురు దంపతులు స్థానికులకు చెప్పడం కూడా జరిగింది.ఎలాగైనా ఇక్కడ మందిర నిర్మాణం జరగాలని స్థానికులతో ఎల్లవేళలా చెప్తూ అలా అమ్మవారిని కొలుస్తూ స్థానికంగా నివసించే ఒడ్డెర కులస్తులతో సత్సబందాలు వుండడం వలన నాలుగు రాతి స్తంభాలను తయారుచేయించి వాటిమద్యలో చిన్నగాఅమ్మవారి ప్రతిరూపంగా రాయిని ఏర్పాటుచేశారు.వారిరువురు అక్కడే చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని జీవనంకొనసాగించారు అలా ఆవ్యక్తి అనారోగ్యకారణంగా పరమపదించారు.స్థానిక భక్తులు అతని భార్య ఇష్టానుసారం అతని భౌతికదేహన్ని అక్కడే ఒక మూలన సమాధినిర్మాణం చేశారు.అతని తదనంతరం అతని భార్య పూజలు చేయడం కొనసాగించారు అలా అతనికి స్థానిక గురువుగా పిలుస్తూ అతని భార్యయైన ఆమెను గురమ్మ గా పిలవడం ఆరంభించారు.ఆ సమయంలో కరువుకాటకాలు సంబవించడం జరిగింది ఆకాలంలోనే గ్రామంలో బావుల నిర్మాణం చేయడం ప్రారంభించారు అలా కరువుకాటకాల సమయంలో స్థానిక అమ్మవారి పూజకార్యక్రమాలు నిర్వహించుటకు నీటి కరువు ఏర్పడింది.అలా గురమ్మకు అమ్మవారు పూనేవారు ఆమె సూచనల మేరకు ఈశాన్యప్రాంతంలో రాతిబండల నడుమ నీటిచెలిమ వుందని పలకడం జరిగింది.ఆమె పలికిన ప్రకారం బండపైన సన్నగా నీటిధార కనబడటం జరిగింది అక్కడనే చిన్నగా గుంటలాంటిది ఏర్పాటు చేశారు స్థానికులు.ఆరాతిపై నీరు తెల్లగా పాలధారలాగా రావడం చూడడానికి చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు తండోపతండాలుగా చూసేందుకు వచ్చారు.ఇదంతా జగజ్జనని మాత కరుణాకటాక్షాలు అనుకుని అక్కడే ఎలాగైనా మందిరం నిర్మించాలని అమ్మవారిని నిత్యం కొలవాలని భక్తులు,గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.అలా వర్షాలు పడటం ప్రారంభమయ్యాయి. ఆ సమయంలోకూడా ప్రతిఒక గడప గడపకు తలా ఇంతా చందాలరూపంలో గ్రామపెద్దల సహకారంతో మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.సికింద్రబాద్ మహంకాళి మందిరము అమ్మవారి మూలవిరాట్టు ను పోలిన ఏకశిల రాతి విగ్రహం ను తయారుచేయించారు.అక్కడనే ప్రక్కన గుడినిర్మాణం చేసి ఘనంగా భక్తిశ్రద్దలతో విగ్రహప్రతిష్టాపన చేశారు.అలా ప్రతిసంవత్సరం వర్షఋతువుకు ఆరంభంలో సికింద్రబాద్ భోనాలు పండుగ జరిగిన వారంరోజుల అనంతరం వచ్చే ఆదివారం రోజున ఘనంగా గ్రామస్థులందరూ భక్తిశ్రద్దలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి భోనాలు సమర్పించి సంతోషంగా వుంచమని మొక్కేవారు.అలా నేటివరకు పూజలందుకుంటున్న మన గ్రామ ఇలవేల్పు శ్రీ జగజ్జనని మహంకాళి అమ్మవారిని భక్తులందరూ నిత్యం భక్తితో పూజలుకొనసాగిస్తున్నారు.
ప్రజలందరూ “ఓంఐంహ్రీంశ్రీంశ్రీజగజ్జనన్యైనమః” అనే మంత్రమును ధ్యానించి అమ్మ ఆశీస్సులు పొందండి